Ban on Begging: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటనకు చెక్పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ “భిక్షాటన నివారణ (సవరణ) చట్టం–2025”ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఎక్కడైనా భిక్షాటన చేస్తే దానిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
ఈ నెల 15వ తేదీన ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపగా, 27న ఏపీ గెజిట్లో చట్టం ప్రచురితమైంది. అనంతరం లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదలైంది.
ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ చట్టాన్ని(Ban on Begging) సంక్షేమ శాఖ – పోలీసు శాఖ సంయుక్తంగా అమలు చేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటన వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించడం, అలాగే నిజమైన నిరుపేదలకు పునరావాసం, ఆర్థిక సహాయం అందించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ చట్టం ద్వారా భిక్షాటన పేరుతో పిల్లలను, వృద్ధులను, దివ్యాంగులను వాడుకునే మాఫియాలను కఠినంగా శిక్షించనున్నారు. అలాగే భిక్షాటనకు బలవంతం చేసే వారిపై జైలుశిక్ష, జరిమానా వంటి శిక్షలు విధించనున్నారు.
భిక్షాటన నిషేధ చట్టం(Ban on Begging) దేశంలో ఇతర ప్రాంతాల్లో ఇలా..
భారతదేశంలో భిక్షాటనపై నిషేదాలు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చట్టాల రూపంలో ఉన్నాయి. ప్రధానంగా ఈ నియమాలు ప్రస్తుతం “బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గరీ అండ్ వాటికల్ యాక్ట్, 1959” ఆధారంగా వ్యాప్తి చెందాయి.
ముఖ్య వివరాలు:
-
భారత దేశంలో కేంద్ర స్థాయిలో ప్రత్యేకమైన భిక్షాటన నిషేధ చట్టం ఉండదు. కానీ, ఎక్కువ రాష్ట్రాలు ఈ బాంబే చట్టానికి అనుగుణంగా తమ సంస్కరణలను ప్రవేశపెట్టాయి.
-
మిజోరాం వంటి రాష్ట్రాలు సంబంధిత చట్టాలు అమలు చేస్తున్నాయి.
-
ఈ చట్టాల కింద భిక్షాటనను నేరంగా పరిగణించి తీవ్రమైన శిక్షలు, పునరావాసం కార్యక్రమాలు అమలులో ఉన్నాయి.
-ఇండోర్ వంటి కొన్ని నగరాల్లో ఖ్యంగా “SMILE” (Support for Marginalised Individuals for Livelihood and Enterprise) కార్యక్రమం ద్వారా భిక్షాగాళ్లకు పునరావాసం, శిక్షణ అందిస్తున్నారు.
కానీ కోర్టులు భిక్షాటన(Ban on Begging)ను పూర్తిగా నేరంగా చూడకూడదని, దాని మూల కారణాలైన ఆర్ధిక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడుతున్నాయి.
ఈ విధంగా, అనేక రాష్ట్రాలలో భిక్షాటనపై నిషేధ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, వాటి లక్ష్యం శిక్షించడం అని కాకుండా పునరావాసం ఏర్పాటు చేయడం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ చట్టంతో రాష్ట్రాన్నిభిక్షాటన రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
