Special Intensive Revision: ఆ రాష్ట్రాల్లో ఓటర్ల లిస్ట్ సస్పెండ్.. ఎందుకంటే..

Special Intensive Revision

ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్వర్ కుమార్

Special Intensive Revision: బీహార్ లో ఓటర్ల జాబితా సవరణల తర్వాత.. ఇప్పుడు 12 రాష్ట్రాలు – కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాలను నవీకరించనున్నారు. ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అక్టోబర్ 28న ప్రారంభమై ఫిబ్రవరి 7న ముగుస్తుందని ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.

103 రోజుల ప్రక్రియలో ఓటర్ల జాబితాను నవీకరించనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లను చేర్చడం, ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం జరుగుతుంది. ఈ 12 రాష్ట్రాలు -కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ల జాబితాలను  స్తంభింపజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు.

ముఖ్యంగా, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో SIR అమలు చేస్తారు. కానీ, అస్సాంలో చేయరు.  అస్సాంలో పౌరసత్వ నియమాలు కొద్దిగా భిన్నంగా ఉన్నాయని, కాబట్టి అక్కడ ప్రక్రియ భిన్నంగా నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

Special Intensive Revision ఉండే 12 రాష్ట్రాల లిస్ట్ ఇదే . . 

  1. అండమాన్ మరియు నికోబార్
  2. ఛత్తీస్‌గఢ్
  3. గోవా
  4. గుజరాత్
  5. కేరళ
  6. లక్షద్వీప్
  7. మధ్యప్రదేశ్
  8. పుదుచ్చేరి
  9. రాజస్థాన్
  10. తమిళనాడు
  11. ఉత్తర ప్రదేశ్
  12. పశ్చిమ బెంగాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *