Winter Season Partner: చలికాలంలో తోడు కావాలనిపించడానికి కారణం అదేనా? సైకాలజిస్టులు చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

winter relationship goals

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది అని సిరివెన్నెల అప్పుడెప్పుడో రాశారు. అంతకుముందూ, ఆ తర్వాత, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా చలి అన్న పదంలోనే రొమాంటిక్ భావన ఉందంటారు కొందరు. చలి గురించి మాట్లాడడం ద్వారా పురుషుడు స్త్రీపై శృంగార కోరికను వ్యక్తపరుస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంటే చలికీ, స్త్రీ పురుషుల మధ్య రొమాంటిక్ అనుభూతులకూ సంబంధం ఉందన్నమాట. అయితే నిజంగా శీతాకాలం రొమాంటిక్ భావన కలిగిస్తుందా? విపరీతమైన చలి శృంగార కోరికలను పెంచుతుందా అనేదానికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు.

శాస్త్రవేత్తల స్టడీలో ఏం తేలింది?

వేసవి లేదా వర్షాకాలంలో ఒంటరిగా ఉండడం స్త్రీ, పురుషులకు పెద్ద కష్టంగా ఉండదని, కానీ చలికాలం మాత్రం భాగస్వామి కావాలన్న ఆలోచనలను పెంచుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరం 24 గంటలూ చురుగ్గా ఉండాలంటే సూర్యకాంతి తప్పనిసరిగా కావాలి. శీతాకాలంలో సూర్యకాంతి మన శరీరానికి ఎక్కువగా చేరదు. ఎంతకీ తెల్లవారదు. తొందరగా చీకటిపడిపోతుంది. అంటే చీకటిగా ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి సంబంధించిన రోజువారీ కార్యకలాపాల్లో అంతరాయం కలుగుతుంది. అప్పుడు మెదడులో ఆలోచనలు మారతాయి. డోపమైన్, ఆక్సిటోసిన్ ప్రభావంతో శారీరక సంబంధాలపై ఆసక్తి కలుగుతుంది. శాస్త్రవేత్తల పరిశీలనలో ఇది తేలింది.

మహిళలకే ఎందుకు?

శృంగార కోరికను పురుషుడు ఎక్కువగా వ్యక్తంచేసినప్పటికీ చలికాలంలో పురుషులతో పోలిస్తే రొమాంటిక్ భావనలు స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం స్త్రీల శరీరతత్వం. స్త్రీల శరీరంలో చర్మం, కండరాల మధ్య కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల చివరివరకు వేడి చేరదు. అలాగే జీవక్రియ దృష్ట్యా మహిళల శరీరం తక్కువ వేడి ఉత్పత్తి చేస్తుంది. ఆ సమయంలో చలిని తట్టుకునేందుకు వేడి కావాలన్న భావన మహిళలకు కలుగుతుంది. భాగస్వామి వైపు ఆలోచనలు మళ్లుతాయి. ఒంటరిగా ఉండే స్త్రీ, పురుషులిద్దరికీ పక్కన ఎవరన్నా ఉంటే బాగుండు అన్న భావన శీతాకాలంలో కలగడానికి కారణాల్లో ఒకటి చల్లటి వాతావరణమే.

ALSO READ: 2050నాటికి మహా వినాశనం తప్పదా? పీల్చే గాలిని కూడా వదలని బడాబాబులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *